Eatala Rajender: గుండెలు రగిలిపోతున్నాయి.. పహల్గాం ఘటనకు ప్రతీకారం తప్పదు: ఈటల

by Prasad Jukanti |

పహల్గాం ఉగ్రవాద దాడి ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Eatala Rajender: గుండెలు రగిలిపోతున్నాయి.. పహల్గాం ఘటనకు ప్రతీకారం తప్పదు:  ఈటల
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) ఘటనలో బాధితులు చిందించిన రక్తం వృథా పోదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. ఈ ఘటనపై తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల.. 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూకాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారు. ఆ తర్వాత కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. అలాంటి చోట ఉగ్రమూకలు దాడి చేయడం అమానుష చర్య అని అన్నారు. ఈ ఉగ్రచర్య భారతీయుల గుండెలను గాయపరిచిందని, దేశ పౌరులు ఆవేశంతో రగిలిపోతున్నారని అన్నారు. భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Next Story