Eatala Rajender: ఇప్పుడు ఆ దిక్కుమాలిన విషయం ఎందుకు?.. కవిత ఆరోపణలపై ఈటల కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-09-15 11:50:55  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు.

Eatala Rajender: ఇప్పుడు ఆ దిక్కుమాలిన విషయం ఎందుకు?.. కవిత ఆరోపణలపై ఈటల కామెంట్స్
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఈటల రాజేందర్ సహా పలువురు సీనియర్లు బీఆర్ఎస్ ను వీడిపోవడానికి హరీశ్ రావు, సంతోశ్ రావే కారణం అంటూ తెలంగా జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ (Eatala Rajender)
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నన్ను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించి వారు ఏం సాధించారని ప్రశ్నించారు. నేను నవ్వు ముఖంతోనే ఉన్నానని చెప్పారు. ఇవాళ హుజూరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా కవిత ఆరోపణలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నపై ఈటల స్పందించారు. యూరియా, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి ఇంత మంచి సబ్జెక్ట్ పై మాట్లాడాక ఆ దిక్కుమాలిన విషయం గురించి ఎందుకు అని అన్నారు. ఆ పార్టీలో ఉండగా నన్ను హింస పెడితే పెట్టొచ్చు. కానీ నాకేమొచ్చింది వారికి ఏమొచ్చిందో అందరికి తెలుసన్నారు. భూలోకంలోనే నరకం అనుభవించిన వ్యక్తిని నేను అని చెప్పారు.
నా జీవితంలో మొదటి సారి చూస్తున్న:ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, గెస్ట్ లెక్చరర్లు, సిబ్బంది బకాయుల గురించి మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆలోచన చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈసమస్యలను ముఖ్యమంత్రి పట్టించుకోకుండా మాటలతో అదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మీ పర్యటనలపై దినపత్రికల్లో వస్తున్న పతాకశీర్షికలను చూసి మురిసిపోతున్నారు కానీ వాటి వెనుక నలిగిపోతున్న ప్రజల గాథను ఆలోచించాలన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అనేది ప్రైవేట్ కాలేజీల సమస్య కాదని లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిందడ్రులు, లక్షల మంది లెక్చరర్ల సమస్య అన్నారు. ఈ విషయంలో భేషజాలకు పోకుండా సమస్యను పరిష్కరించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. తాను ఇన్నేళ్లుగా ప్రభుత్వంలో ఉండి అనేక బాధ్యతలు చూశానని కానీ ఇంత బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వాన్ని మాత్రం తొలిసారి చూస్తున్నానని విమర్శించారు. ఇది మంచిది కాదన్నారు. యూరియా కొరత విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్లక్ష్యం అని విమర్శించారు. వర్షాలు బాగా వర్షాలు పడితే యూరియా బాగా వాడుతారని అంతే తప్పా యూరియా వాడకూడదని చెబితే ఎలా అన్నారు. ప్రభుత్వానికి అంచనా ఉండాలి కదా? బఫర్ స్టాక్ పెట్టుకోవాలి కాదా అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వంపై నిందలు వేయడం ఆపేయాలన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
Next Story