Eatala Rajender: బీసీల జీవితాలతో చెలగాటమొద్దు: ఎంపీ ఈటల

by Prasad Jukanti |   (  Updated:2025-10-29 12:50:30  IST  )

మనలో ఐక్యత లేకపోవడం వల్ల ఒకరిని దించి మరొకరిని అధికారంలో కూర్చోబెట్టడానికి మాత్రమే మనం పనికి వస్తున్నామని ఈటల అన్నారు.

Eatala Rajender: బీసీల జీవితాలతో చెలగాటమొద్దు: ఎంపీ ఈటల
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం బీసీల జీవితాలతో చెలగాటం ఆడవద్దని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatela Rajender) అన్నారు. బీసీల రిజర్వేషన్ల (BC reservations) విషయంలో మోసం చేయాలని చూస్తే అదే ఉచ్చులో చిక్కుకొని గిలగిలలాడక తప్పదు అని హెచ్చరించారు. ప్రజలు అమాయకులు అనుకుంటే అంతకంటే వెర్రిబాగులతనం ఇంకోటి ఉండదని సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనకు అనుగుణంగా, రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రం తమిళనాడు అని అక్కడ 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు సర్వే చేసి సుప్రీంకోర్టు ముందు పెడితే కోర్టు కూడా ఏం చెయ్యలేక పోయిందన్నారు. ఇది ఆషామాసి విషయం కాదు బ్రతుకు సంబంధించిన విషయం రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్న చేయవద్దన్నారు. ఇవల హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ సగర సంఘం ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాధికారం వరకు ఆగదు:

మనలో ఐక్యత లేకపోవడం వల్ల ఒకరిని దించి మరొకరిని అధికారంలో కూర్చోబెట్టడానికి మాత్రమే మనం పనికి వస్తున్నామని ఇక ఇది ఎన్నో రోజులు ఇది నడవదని ఈటల అన్నారు. బీసీలలో చైతన్యం వచ్చిందని ఇక రాజ్యాధికారం వచ్చేంతవరకు ఇది ఆగదని చెప్పారు. జెండాలు ఎజెండాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండా కోసం అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు పనిచేశాయి. లౌక్యాన్ని ప్రదర్శించి బీసీ రిజర్వేషన్ల సాధన ఏకైక అజెండాగా అన్ని పార్టీలను ఏకం చేసే రాజకీయ వేదికను తయారు చేయాలని అందరినీ ఏకం చేయండని పిలుపునిచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 50 శాతం సీలింగ్ అనే కాన్సెప్ట్ పోయిందని కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీలింగును దాటి రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయని అన్నారు. సమాజానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి తప్ప చట్టం ఎప్పుడూ జడపదార్థం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం జన గణన చేస్తానని ప్రకటించింది. దేశవ్యాప్తంగా జనగణన జరగాల్సిందేనని సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులపై రిపోర్టు తయారు చేయాల్సిందేనన్నారు.

Next Story