Eatala Rajendar: మన సంప్రదాయాలను కాపాడుకోవాలి.. చినజీయర్ స్వామి‌తో ఎంపీ ఈటల

by Ramesh Naini |

మన సంప్రదాయం చాలా గొప్పది.. మన సంప్రదాయాలను కాపాడుకోవాలని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

Eatala Rajendar: మన సంప్రదాయాలను కాపాడుకోవాలి.. చినజీయర్ స్వామి‌తో ఎంపీ ఈటల
X

దిశ, డైనమిక్ బ్యూరో: మన సంప్రదాయం చాలా గొప్పది.. మన సంప్రదాయాలను కాపాడుకోవాలని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) అన్నారు. ఇది ఒక్క ప్రభుత్వాలతోనే సాధ్యం కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని పిలుపునిచ్చారు. బుధవారం ఓల్డ్ అల్వాల్ లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రాజగోపురం ప్రతిష్టాపన కార్యక్రమలో (Chinnajeeyar) చినజీయర్ స్వామితో కలిసి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చినజీయర్ చేతులమీదుగా రాజగోపురం ప్రతిష్టాపన జరగడం సంతోషకరమని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో కూడా మన దేవాలయాలను కట్టుకున్నామని అన్నారు. ఇంత పెద్ద భారతదేశం చల్లగా ఉంటుంది.. అంటే కారణం మన సంస్కృతి సంప్రదాయాలేనని కొనియాడారు. ప్రపంచంలో.. సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకునే దేశం భారత్ ఒక్కటే కావొచ్చని అభిప్రాయ పడ్డారు. అదే భారత దేశ గొప్పతనం అని అన్నారు.

మన చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం.. కానీ మనదేశం ప్రపంచానికే ఆదర్శమని కొనియడారు. ఒకప్పుడు భారత దేశం విశ్వగురు మళ్లీ అది సంతరించు కోవడానికి మనందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుంభమేళా ఎంత గొప్పగా జరిగిందో చూస్తున్నామని వెల్లడించారు. ఎంత అంతస్తు ఉన్నా, ఆస్తి ఉన్న మన సంప్రదాయాలు కాపాడుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. ప్రజలందరూ సుఖంగా సంతోషం ఉండాలని, శివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story