- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చచ్చిపోతాం అని కొంగుపట్టి ఓట్లు అడిగితే కరిగిపోయారు.. సొంత గడ్డపై ఈటల సంచలన వ్యాఖ్యలు
ఎన్నికలంటే ఎమోషన్, కులం, రంగుకు సంబంధిచింది కాదని ప్రజల బ్రతుకుకు సంబంధించిందని ఈటల రాజేందర్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై (Padi Kaushik Reddy) బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి చచ్చిపోతాం అని కొంగుపట్టి ఓటు అడిగితే చచ్చిపోతాడేమో అని మన ఆడబిడ్డలు కరిగిపోయి ఓట్లు వేస్తే ఈ రెండేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. ఇవాళ హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ పంచాయితీ (Kamalapuram) సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో వారు చేసింది కేవలం డ్రామా అని తేలిపోయిందన్నారు. ఒక్కరోజు వారు ఏడుస్తారు మీరు ఐదేళ్లు ఏడుస్తారు అని మా జమునమ్మ చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదని కానీ రెండేళ్లుగా ఏం జరుగుతుంది చూస్తూనే ఉన్నారు… మీ అంతరాత్మకు అడగండి అన్నారు. ఎన్నికలంటే ఎమోషన్, కులం, రంగుకు సంబంధిచింది కాదని ప్రజల బ్రతుకుకు సంబంధించిందన్నారు. పదవులు మీ ఓట్లకు పుట్టేవని డబ్బుకు, సారా సీసాకు పుట్టేవి కావన్నారు. నన్ను ఈస్థాయికి తీసుకు వచ్చింది, నన్ను గుర్తుపట్టడానికి కారణం ఈ కమలాపూర్ గడ్డ అన్నారు.
నేను ఈ ఊరి బిడ్డను, ఈ మట్టిలో పుట్టిన బిడ్డను. రెండేళ్ల తరువాత మీ ముందుకు వచ్చానన్నారు. ఈటల రాజేందర్ ఏం చేశాడు అని అడుగుతున్నారట.. మీరు వందకిలోటర్ల స్పీడ్‍తో పోయే రోడ్లు, కమలాపూర్‍లో ఉన్న విద్యాసంస్థలు, ఆరోగ్యం బాగాలేకపోతే మీరు వెళ్తున్న దవాఖానాలు నేను కట్టించినవేనన్నారు. డల్లాస్ చేస్తా.. కేసీఆర్ తాతతో వందల కోట్లు తీస్తా అని చెప్తే ఓటు వేసి ఆగం అయ్యారన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సంక్షేమ, అభివృద్ధి పనులు చేయించానని నిధులు ప్రజల సొమ్ము ఎవడబ్బ జాగీరు కాదన్నారు. నాయకులు ఇంట్లో నుండి పెట్టే డబ్బులు కావు. ప్రజలు కట్టే టాక్స్ నుండి వచ్చినవేనన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. సర్పంచ్‍లు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదని విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుందని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా కేంద్రం నిధులతోనే కడుతున్నారన్నారు. గ్రామపంచాయితీ సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా రాష్ట్రం దగ్గర డబ్బులు లేవన్నారు. రెండేళ్లుగా గ్రామాలు వల్లకాడులయ్యాయి. హాస్పిటల్ సమస్యలు, పిల్లల ఫీజుల గురించి మాట్లాడే నాధుడు లేకుండ అయ్యారని, ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో పేదలకు ఏం అవసరం పడ్డా నేనే చేసిపెడుతున్నానన్నారు.
కొంతమంది డబ్బులిచ్చి ఓట్లను కొంటాం అంటున్నారట.. అంగట్లో పశువులకు వెలకడతారు, దుకాణంలో సరుకులకు వెలకడతారు కానీ మనుషుల ఆత్మగౌరవానికి కాదన్నారు. అలాంటి వారు మనుషులు కాదు. డబ్బులు ఉన్నవారే గెలవాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఠక్కున దిగుతారు. ఓటుకు ఐదు వేలు ఇస్తారు గెలిచాక మళ్లీ కనిపించరు. ఏడిస్తే కనికరించి ఓటు వేస్తే మళ్లీ వచ్చి ఎవరన్నా చూసారా? పనిమంతుణ్ణి ఎన్నుకుంటే ఐదేళ్లు పని చేస్తారని మర్చిపోవద్దన్నారు.
కమలాపూర్‍లో చేనేత కార్మికులకు 25 ఏళ్లుగా ఏం కావాలన్న చేసి పెట్టానని నేను ఏ ఒక్కరి వ్యక్తినో కాదు అందరి వాడినన్నారు. 25 ఏళ్లుగా 365 రోజులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాని చెప్పారు. హుజూరాబాద్ తో నీకేం సంబంధం అని అడుగుతున్నారట అసలు నీకేం సంబంధం. ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకే. ఇది నన్ను కన్న గడ్డ. ఈటల పేదల పక్షాన కొట్లాడే బిడ్డ. అధికారం ఉన్న లేకున్నా మీకు కావాల్సినవి అందించే భాద్యత నాది అన్నారు.






