Eatala: సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

Eatala: సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (September 17) సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అలాగే సెప్టెంబర్ 17న దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) జన్మదిన్నని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మోడీ నాయకత్వంలో గుజరాత్ గొప్పగా అభివృద్ధి చెందిందని, వారి నాయకత్వంలో ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి గౌరవం, ఔన్నత్యం గొప్పగా పెరిగిందన్నారు. పేద దేశంగా ముద్రపడ్డ భారత్.. మోడీ నాయకత్వంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రాబోయే కాలంలో మోడీ మరింత ఆరోగ్యంగా ఉండి, దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story