రేపటి నుండి ఎప్ సెట్ పరీక్షలు ప్రారంభం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-03 14:43:44  IST  )

రాష్ట్రవ్యాప్తంగా అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్ సెట్ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి.

రేపటి నుండి ఎప్ సెట్ పరీక్షలు ప్రారంభం
X
  • అగ్రి, ఫార్మా పరీక్షలకు 106 సెంటర్లు ఏర్పాట్లు
  • నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నో ఎంట్రీ

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్ సెట్ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేడు ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు, అలాగే రేపు ఉదయం సెషన్ లలో పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 90,968 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే ఇన్విజిలేటర్ కు చెప్పాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర అవాంతరాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు కనీసం గంటన్నర ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును వెంట తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని అధికారులు తెలిపారు.

Next Story