తెలంగాణలో ఈగల్ ఫోర్స్ మెరుపుదాడులు.. మూడు కేసుల్లో ఆరుగురు అరెస్ట్

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో డ్ర‌గ్స్ నిర్మూలించేందుకు ఈగ‌ల్ టీం మెరుపుదాడులు చేస్తోంది. ఎక్క‌డ గంజాయి, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా, అమ్మ‌కాలు జ‌రుగుతున్నా డేగ క‌న్నువేసి ప‌ట్టుకుంటుంది.

తెలంగాణలో ఈగల్ ఫోర్స్ మెరుపుదాడులు.. మూడు కేసుల్లో ఆరుగురు అరెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో డ్ర‌గ్స్ నిర్మూలించేందుకు ఈగ‌ల్ టీం మెరుపుదాడులు చేస్తోంది. ఎక్క‌డ గంజాయి, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా, అమ్మ‌కాలు జ‌రుగుతున్నా డేగ క‌న్నువేసి ప‌ట్టుకుంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రోసారి రాష్ట్రంలో మెరుపుదాడులు చేసింది. మూడు ప్రాంతాల్లో దాడులు చేసి ఆరుగురు డ్ర‌గ్స్ పెడ్ల‌ర్ల‌ను ప‌ట్టుకుంది. న్యూయ‌ర్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఈగ‌ల్ టీమ్ చాలా యాక్టివ్ గా ప‌నిచేస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఇక నేడు మూడు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేయ‌గా 330 గ్రాముల గంజాయి, 43 గ్రామ‌లు కొకైన్ మ‌రియు 11.5 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకుంది. వ‌రంగ‌ల్ లో ముగ్గురు గంజాయి స‌ప్లై చేస్తున్న‌వారిని అరెస్ట్ చేయ‌గా, మియాపూర్ లో 250 గ్రాముల గంజాయితో ఒక‌రు, మ‌సాబ్ ట్యాంక్ లో డ్ర‌గ్స్ తో ఇద్ద‌రు ప‌ట్టుబ‌డ్డారు. అంతేకాకుండా ఈ దాడుల్లో ఏపీ, తెలంగాణ మ‌ధ్య అంత‌ర్రాష్ట్ర డ్ర‌గ్స్ నెట్ వ‌ర్క్ న‌డుపుతున్న‌ట్టు కూడా ఈగ‌ల్ టీం గుర్తించింది. ఈగ‌ల్ వ‌రుస దాడుల‌తో డ్ర‌గ్స్ పెడ్ల‌ర్లు కూడా వ‌ణికిపోతున్నారు. ఒక‌సారి ప‌ట్టుబ‌డితే క‌ట‌క‌టాల్లోకి వెలుతుండ‌టంతో భ‌యాందోళ‌న చెందుతున్నారు.

Next Story