- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ దూకుడు.. గవర్నర్‌కు వ్యూహాల ప్రజెంటేషన్
ఈగల్ ఫోర్స్ కార్యకలాపాలు, డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపడుతున్న చర్యల పై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈగల్ ఫోర్స్ కార్యకలాపాలు, డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపడుతున్న చర్యల పై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్ ఫోర్స్) అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను లోక్ భవన్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించేందుకు అమలు చేస్తున్న వ్యూహాలను గవర్నర్‌కు వివరించారు.
డ్రగ్స్ నియంత్రణలో భాగంగా అవగాహన కార్యక్రమాలు, అమలు చర్యలు, విభాగాల మధ్య సమన్వయంపై వివరించారు. హైదరాబాద్, రాచకోండ, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్ పరిధిలో నాలుగు నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లు, రాష్ట్ర వ్యాప్తంగా 7 నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్స్ విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కోన్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, రైల్వేలలో నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్స్ ఉన్నట్లు తెలిపారు.






