వాయిదాల చెల్లింపులో వివాదం.. కర్రలతో కొట్టుకున్న డ్వాక్రా గ్రూప్ మహిళలు

by Prasad Jukanti |

వాయిదాల చెల్లింపు విషయంలో మొదలైన గొడవ డ్వాక్రా మహిళలు కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది.

వాయిదాల చెల్లింపులో వివాదం.. కర్రలతో కొట్టుకున్న డ్వాక్రా గ్రూప్ మహిళలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బ్యాంకు నుంచి తీసుకున్న రుణం వాయిదా చెల్లింపు విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి డ్వాక్రా (DWACRA) గ్రూప్ మహిళల మధ్య కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది. సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. జోగిపేటలో ఓ మహిళా సంఘం బ్యాంకు నుంచి రుణం తీసుకోగా రుణవాయిదాల చెల్లింపు విషయంలో సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. సక్రమంగా వాయిదాలు చెల్లించకపోవడం వల్ల గ్రూప్ మొత్తం డిఫాల్ట్ అయ్యే ప్రమాదంతో పాటు మిగిలిన సభ్యులపై కూడా ఆ భారం పడుతోందని ఈ విషయంలో సభ్యుల మధ్య ఇవాళ వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో రగిలిపోయిన సభ్యులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వారిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story