- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనం దసరా.. ప్రజలకు పండుగ విషెస్ చెప్పిన CM రేవంత్ రెడ్డి
by Kema Shiva Kumar |
దసరా పండుగ విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం.. శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణకు ప్రత్యేకమని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆ దుర్గామాతను సీఎం రేవంత్రెడ్డి ప్రార్థించారు.
Next Story






