- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్టోబర్ 3న దసరా..?
దసరా పండుగ దేశమంతటా అక్టోబర్ 2 న జరిగితే వాళ్ళు మాత్రం మరుసటి రోజున 3 వ తేదీన జరుపుకుంటున్నారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : దసరా పండుగ దేశమంతటా అక్టోబర్ 2 న జరిగితే వాళ్ళు మాత్రం మరుసటి రోజున 3 వ తేదీన జరుపుకుంటున్నారు. అదేంటి..? ఒకరోజు ఆలస్యంగా ఎందుకు అని అనుమానం కలుగుతోందా..! ఎందుకిలా అని అడిగితే...వాళ్ళు అదంతే అంటున్నారు. కారణం ఏమిటంటే...దసరా పండుగ అక్టోబర్ 2 తేదీ గాంధీ జయంతి రోజున రావడమే. ఈ రోజు మద్యం, మాంసం దుకాణాలు మూసి ఉండటం... ఇందుకు తోడు దుర్గా దేవి దీక్షల విరమణ, అమ్మవారి నిమజ్జన వేడుకలు ఉండటం, కొందరికి గురువారం రావడం ప్రతిబంధకంగా మారాయి. అసలు దసరా పండుగ అంటేనే జిహ్వ చాపల్యం ఉన్న ప్రతి ఒక్కరూ మందుతో కూడిన మాంసాహార విందు చేసుకోవడం పరిపాటి. అలాంటి పండగ రోజున ఇలాంటి పరిస్థితులు రావడంతో అనేక కుటుంబాల్లో ఆ స్థాయి సంబరం కనిపించలేదు. అందుకే...ఉందిలే మంచికాలం ముందుముందునా అన్నట్టు పండగ సంబురం మరుసటి రోజు శుక్రవారం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే గ్రామాలు, పట్టణాల గల్లీల్లో మేకలు కోసి పాళ్లు వేసుకొని, మద్యంతో మజా చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.






