- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దసరా పండుగ ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరిసిన జేబీఎస్
దసరా.. తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ. ఓ వైపు దుర్గా శరన్నవరాత్రోత్సవాలు, మరోవైపు బతుకమ్మ పండుగతో జనం ఇప్పటికే ఫెస్టివ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: దసరా.. తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ. ఓ వైపు దుర్గా శరన్నవరాత్రోత్సవాలు, మరోవైపు బతుకమ్మ పండుగతో జనం ఇప్పటికే ఫెస్టివ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ (Hyderabad) నగరానికి వచ్చిన వారంతా వరుస సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని జూబ్లీ బస్ స్టేషన్ (JBS) ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అయితే, రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీ ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా నడుపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఇప్పటికే అందరూ జేబీఎస్‌కు చేరుకుంటున్నారు.
ఇక మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS)లోకి పెద్ద ఎత్తున మూసీ వరద నీరు రావడంతో బస్సుల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, బస్టాండ్‌లోకి క్రమంగా వరద నీరు తగ్గడంతో యథావిధిగా సర్వీసులు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల స్టార్టింగ్ పాయింట్లను తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులను ఎంజీబీఎస్, జేబీఎస్ (JBS) నుంచి నడుపుతున్నారు. అదేవిధంగా వరంగల్, హన్మకొండ వైపుకు వెళ్లేవి ఎంజీబీఎస్ వయా ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపుకు బస్సులను ఎంజీబీఎస్ వయా ఎల్బీ నగర్ (LB Nagar) నుంచి, మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వైపుకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులు (RTC bus Services) ఎంజీబీఎస్ఆ వయా ఆరాంఘర్ నుంచి నడుస్తున్నట్లుగా ఇప్పటికే టీజీ ఆర్టీసీ స్పష్టం తెలిపింది.






