- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుద్దిళ్ళ శ్రీపాద రావు జయంతి.. నివాళులర్పించిన అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్
by Gantepaka Srikanth |
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి దుద్దిళ్ళ శ్రీపాద రావు(Duddilla Sripada Rao Jayanti) జయంతి సందర్భంగా శాసనసభ లాంజ్‌లో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి దుద్దిళ్ళ శ్రీపాద రావు(Duddilla Sripada Rao Jayanti) జయంతి సందర్భంగా శాసనసభ లాంజ్‌లో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar), శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, జగిత్యాల, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్, సంజీవ రెడ్డి మరియు లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అధికారులు ఉన్నారు. మరోవైపు.. హైదరబాద్ రవీంద్ర భారతిలో శ్రీపాద రావు 87వ జయంతి ఉత్సవాలు నిర్వహించతలపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
Next Story






