- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వాన్ని కూల్చేందుకు డబ్బులిస్తామంటుండ్రు.. దుబ్బాక ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఓవైపు బిల్డర్లు.. మరోవైపు పారిశ్రామివేత్తలు ఏకమయ్యారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఓవైపు బిల్డర్లు.. మరోవైపు పారిశ్రామివేత్తలు ఏకమయ్యారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులిస్తామని ముందుకొస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఇదే మాట అంటూ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా నియోజకవర్గానికి నిధులు రాలే..
సొంత పార్టీపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇవాళ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తమ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాడు కూడా దుబ్బాక నియోజకవర్గానికి నిధులు రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, తమ నియోజకవర్గ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లినప్పుడు సానుకూలంగా స్పందించారని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ లేదా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ వంటి వాటిలో ఏదో ఒకటి నియోజకవర్గానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ విషయంలో భూసేకరణపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా ఆదేశాలు అందాయని పేర్కొన్నారు.






