- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DTC Kishan Naik: అవినీతి తిమింగలం డీటీసీ కిషన్ నాయక్‍కు 14 రోజుల రిమాండ్
ఏసీపీ సోదాల్లో కిషన్ నాయక్ వద్ద కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు బయటపడ్డాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‍కు (DTC Kishan Naik) ఏసీబీ కోర్టు (ACB Court) 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను ఇవాళ తెల్లవారుజామున చంచల్ గూడా జైలుకు (Chanchalguda Jail) తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లి ఆర్ఆర్ నగర్ కాలనీలోని కిషన్ నాయక్ నివాసం, హైదరాబాద్, నిజామాబాద్, నారాయణఖేడ్‍లలో ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాలతో పాటు మహబూబ్ నగర్ లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం సహా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాలు ముగిసిన అనంతరం డీటీసీ కిషన్ నాయక్ ను అధికారులు ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో ఆయన్ను విచారించేందుకు కస్టడీ కోసం ఏసీబీ పిటీషన్ వేయబోతున్నట్లు సమాచారం. నిన్నటి సోదాల్లో కిషన్ నాయక్ కు చెందిన స్థిర,చర ఆస్తుల విలువ 400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాడులు జరుగుతాయని ముందే ఊహించిన కిషన్ నాయక్ తన వద్ద ఉన్న బంగారాన్ని ముందే ఇతర చోటికి తరలించినట్లు గుర్తించారు. కిషన్ నాయక్ అవినీతి చిట్టా తవ్వుతున్న ఏసీబీ అధికారులు ఇవాళ ఆయన బ్యాంకు లాకర్ ను తెరవబోతున్నారు.






