లక్ష ఉత్తరాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనస్సు ముట్టడి.. డీఎస్పీ స్టేట్ చీఫ్ విశారదన్

by Ramesh Naini |   (  Updated:2025-01-27 14:45:21  IST  )

లక్ష ఉత్తరాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనస్సు ముట్టడిస్తున్నట్లు డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ పేర్కొన్నారు.

లక్ష ఉత్తరాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనస్సు ముట్టడి.. డీఎస్పీ స్టేట్ చీఫ్ విశారదన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లక్ష ఉత్తరాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మనస్సు ముట్టడిస్తున్నట్లు (DSP State President Visharadhan Maharaj) డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా లేఖ బహిరంగ లేఖలు అంటూ విడుదల చేశారు. భారత గణతంత్ర దినోత్సవం జనవరి 26 న జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంథాన్ని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజూ విద్యా సంస్థలలో విద్యార్థులు చదివే ప్రార్ధనా స్థానంలో.. భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా చదివించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వేతర సంస్థలను కూడా ఆదేశించాలని “డిమాండ్ లేఖ”ని తెలంగాణ లోని లక్ష మంది పౌరులతో రాస్తున్నట్లు తెలిపారు.

త్వరగా అమలు నిర్ణయయాన్ని.. రేపటిలోగా జీవో ద్వారా తీసుకోవాలని, ఆ అద్భుత దృశ్యాన్ని తెలంగాణ ప్రజలందరికి చూపించాలని కోరారు. అందుకోసమే మూడు రోజుల నుంచి తెలంగాణ అంతటా.. లక్ష ఉత్తరాల ఉద్యమం రాయడం మొదలు పెట్టామన్నారు. మీ నాయకుడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని దేశమంతటికీ ఎత్తి చూపిన దృశ్యం నిజమే అయితే.. జనవరి 26న జెండా వద్ద మన తెలంగాణ రాష్ట్ర మంతటా రాజ్యాంగ గ్రంథం, అంబేడ్కర్ చిత్రపటాలను పెట్టాలన్నారు. మీరు దీన్ని అమలు చేయక పోతే.. మీరు భారత రాజ్యాంగ నాటకం, కుల గణన నాటకం మొదలు పెట్టారని.. భావించాల్సి వస్తుంది అని విమర్శించారు.

Next Story