గుడిబండలో డ్రై పోర్ట్ కోసం స్థల పరిశీలన

by Bhanu |

అడ్డాకుల మండలంలోని గుడిబండ శివారులో డ్రై పోర్ట్ నిర్మాణానికి సంబంధించి సోమవారం సీఎంవో అధికారులు స్థల పరిశీలన చేశారు.

గుడిబండలో డ్రై పోర్ట్ కోసం స్థల పరిశీలన
X

దిశ, అడ్డాకుల: అడ్డాకుల మండలంలోని గుడిబండ శివారులో డ్రై పోర్ట్ నిర్మాణానికి సంబంధించి సోమవారం సీఎంవో అధికారులు స్థల పరిశీలన చేశారు. గుడిబండ శివారులో ఉన్న 118 సర్వే నంబరులోని సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ పరిశీలనకు దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్‌ను ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ప్రభుత్వం చొరవ తీసుకుందని, ఇప్పుడు మరో ముఖ్యమైన పరిశ్రమగా డ్రై పోర్ట్‌ను స్థాపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఈ ప్రాజెక్టుతో అడ్డాకుల మండలానికి చెందిన యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లామని, ఆయన స్పందనతో సంబంధిత అధికారులచే స్థల పరిశీలన జరుగుతోందని వివరించారు. పరిశీలన అనంతరం పూర్తి నివేదికను ప్రభుత్వం సమర్పించనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ప్రాంత ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Next Story