- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాదాపూర్‌లో మరో ఘటన.. మద్యం మత్తులో డ్రైవర్‌పై దాడి
మద్యంమత్తులో ఉన్న యువత.. అనవసరంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో లొల్లి పెట్టుకుని దాడి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మాదాపూర్ లో మరో ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో యువకులు బీభత్సం సృష్టించారు. ఆదివారం ఉదయం పటాన్ చెరు నుంచి కోఠివైపు వెళ్తున్న బర్కత్ పురా డిపోకు చెందిన బస్సు తమ కారుకు సైడ్ ఇవ్వలేదని రెచ్చిపోయారు. మాదాపూర్ వద్ద ఓవర్ టేక్ చేసి బస్సుకు అడ్డంగా కారు నిలిపిన యువకులు డ్రైవర్ పై దాడికి దిగారు. బస్సు అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు. అటువైపుగా వెళ్తున్న బైకర్ కు రాయి తగిలి తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత ఇద్దరు యువకులు, యువతి కారులో పరారయ్యారు. బస్సు డ్రైవర్ మొయినుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గతరాత్రి మాదాపూర్ లో అమానుషం
మాదాపూర్ పరిధిలోని మైండ్ స్పేస్ వద్ద ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న దంపతుల్ని ఢీ కొట్టిన డ్రైవర్ కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక భర్త పక్కకు పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. స్కూటీపైనే ఉన్న డ్రైవర్ కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లడంతో స్థానికులు గమనించి ఆపగా.. వాహనాన్ని వదిలి పరారయ్యాడు. ప్రస్తుతం అబ్దుల్ బాసిత్ గచ్చిబౌలి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇద్దరూ మలబార్ గోల్డ్ షాపులో పనిచేస్తున్నారు. సినిమా చూసి, తిరిగి మహేశ్వరం వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. అయితే డీసీఎం డ్రైవర్ కావాలనే ఈ పనిచేశాడా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్న విషయం తెలియాల్సి ఉంది.






