- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆఫీసులోనే ఆనందభైరవం..? ఓ ట్రాఫిక్ డీసీపీ వాంతుల కహానీ
గ్రేటర్ హైదరాబాద్ లోని అది అత్యంత విశాలమైన పోలీసు కమిషనరేట్ ఇది. ఈ పోలీసు కమిషనరేట్ కు చెందిన ఓ ట్రాఫిక్ డీసీపీ వాంతుల..

దిశ, సిటీక్రైం : గ్రేటర్ హైదరాబాద్ లోని అది అత్యంత విశాలమైన పోలీసు కమిషనరేట్ ఇది. ఈ పోలీసు కమిషనరేట్ కు చెందిన ఓ ట్రాఫిక్ డీసీపీ వాంతుల సంఘటన ఇప్పుడు ఈ పోలీసు కమిషనరేట్ పరిధిలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వాంతుల కహాని న్యూస్ కింద ఎందుకైదంటే ట్రాఫిక్ డీసీపీ తన అధికారిక కార్యాలయంలో మద్యం సేవించి, అక్కడనే వాంతులు చేసుకోవడంతో కారణమైంది. ఈ వాంతుల గలీజును తుడిచేందుకు ఆ కార్యాలయం సిబ్బంది ఇబ్బంది పడుతూ శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ సంఘటన పోలీసు వర్గాల్లో వేగంగా ప్రచారమైంది. డీసీపీ స్థాయి అధికారి నిబంధనలకు విరుద్ధంగా తన కార్యాలయంలోనే మద్యం సేవించడం ఎంత వరకు కరెక్ట్ అని పోలీసు వర్గాల్లో ప్రశ్నించుకుంటున్నారు.
అదే కింది స్థాయి సిబ్బంది ఇలా తప్పు చేస్తే దానిని పెద్దగా చేసి డిపార్ట్ మెంటల్ యాక్షన్ లు, సస్పెన్షన్ లంటూ ఉన్నతాధికారులు హంగామా చేస్తారనే విమర్శలు ఉన్నాయి. మరి డీసీపీ స్థాయి అధికారి ఇలా ఏకంగా కార్యాలయంలో నే మద్యం సేవించి వాంతులు చేసుకుని పడిపోతే అతని పై ఎందుకు క్రమశిక్షణ చర్యలు ఉండవని పోలీసులు వర్గాలు అంటున్నాయి. కీలకమైన ప్రాంతంలో ట్రాఫిక్ డీసీపీ గా ఉన్న ఈ అధికారి వ్యవహర శైలితో కింది స్థాయి సిబ్బంది, అధికారుల్లో క్రమశిక్షణ తప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఇలా చాలా సార్లు ఈ డీసీపీ పై కార్యాలయంలోనే మద్యం సేవించాడనే ఫిర్యాదులు ఉన్నతాధికారులకు మౌఖికంగా అందించినా ఇంత వరకు ఎవరు చర్య తీసుకోకపోవడం గమనార్హం. తాజాగా మద్యం సేవించి వాంతులు చేసుకోవడంతో కింది స్థాయి సిబ్బంది కొంచెం గుర్రుగా ఉన్నారు.
ఇలాంటి అధికారిని రద్దీ ప్రాంతాలు ఉండే జోన్ కు ట్రాఫిక్ డీసీపీ గా పెడితే ట్రాఫిక్ రద్దీ, సమస్యలను నివారించేందుకు ఇక కింది స్థాయి అధికారులు ఎంత వరకు నిజాయితీగా పని చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అధికారుల వల్ల సోసైటీలో పోలీసు ప్రతిష్ఠ దిగజారిపోతుందని పోలీసులు వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మద్యం సేవించడం అంత ఇష్టమైతే ఆ అధికారి వీఆర్ఎస్ తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు కదా ఇలా డ్యూటీలో నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తిస్తు పోలీసు ఇమేజ్ ను ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారనే గుసగుసలు పోలీసు వర్గాల్లో వినపడుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి ఉన్నతాధికారుల పై చర్యలు తీసుకోవాలని పోలీసు వర్గాలు కోరుతున్నాయి.






