- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందుబాబులకు షాక్...ఇకపై డే టైంలోనూ టెస్టులు
మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఇకపై డే టైంలోనూ డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఇకపై డే టైంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. మింట్ కాంపౌండ్‌లో స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొన్న సీపీ జోయల్ డేవిస్ మీడియాతో మాట్లాడుతూ... నేటి నుండి డే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు.
గతంలో రాత్రిపూటనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేవాళ్లమని అన్నారు. ఇటీవల డే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా ఆశ్చర్యకరంగా స్కూల్ బస్సు డ్రైవర్లు 25 మంది మద్యం సేవించి దొరికారని చెప్పారు. ఓ డ్రైవర్‌కు ఏకంగా 400 రీడింగ్ వచ్చిందన్నారు. కాబట్టి స్కూల్ బస్సు డ్రైవర్లకు టెస్టులు నిర్వహించాలని యాజమాన్యాలను కూడా ఆదేశించామని చెప్పారు. స్కూల్ బస్ డ్రైవర్ల పరిస్థితే ఇలా ఉంటే మిగితా వాళ్ల పరిస్థితి ఏంటని అన్నారు. అందువల్లనే డే టైంలో కూడా టెస్టులు నిర్వహిస్తామని చెప్పారు.






