- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు.. రూ.12 వేలకోట్ల డ్రగ్స్ లభ్యం
తెలంగాణలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టు రట్టయింది. మేడ్చల్ జిల్లాలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో 12 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ లభ్యమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టు రట్టయింది. మేడ్చల్ జిల్లాలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో 12 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారీకి వాడే 32 వేల లీటర్ల రా మెటీరియల్ కూడా లభ్యమవ్వగా.. వాటిని సీజ్ చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన మహిళ అరెస్ట్ అవ్వడంతో ఈ డ్రగ్స్ గుట్టు బయటపడగా.. మేడ్చల్ లో 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి పెద్దఎత్తున డ్రగ్స్ తయారీ అవుతుండగా.. వాటిని దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు.
ఎండీ, ఎక్స్‌టాసీ, మోలీ, ఎక్స్‌టీసీ పేర్లతో డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తయారు చేసేందుకు కావలసిన కాంపోనెంట్స్ భారీగా లభ్యమయ్యాయన్నారు. డ్రగ్స్ తయారీ చేస్తున్న కంపెనీని పోలీసులు సీజ్ చేశారు.






