Drugs Case : నేడు ఈడీ విచారణకు టాలీవుడ్ హీరో

by Sathputhe Rajesh |   (  Updated:2023-10-10 06:07:15  IST  )

డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు నేడు టాలీవుడ్ హీరో నవదీప్ ను ప్రశ్నించనున్నారు.

Drugs Case : నేడు ఈడీ విచారణకు టాలీవుడ్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు నేడు టాలీవుడ్ హీరో నవదీప్ ను ప్రశ్నించనున్నారు. నవదీప్ డ్రగ్స్ సేవించినట్లుగా ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 29వ నిందితుడిగా నవదీప్ ఉన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు నైజీరియన్లతో పరిచయాలపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. వీరితో జరిపిన బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించనున్నారు. ఈ కేసులో నార్కోటిక్స్ పోలీసులు బెంగళూరులో పలువురు నైజీరయన్లను అరెస్ట్ చేశారు. మరోవైపు నవదీప్ ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ విచారణ చేస్తోంది. ఇక, నవదీప్ నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయనేది ఉత్కంఠగా మారింది. అయితే ఈడీ ఎదుట నవదీప్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Next Story