హిందూ బాలికలు టార్గెట్.. పాతబస్తీలో డ్రగ్స్-లైంగిక దాడులు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్

by Ramesh Naini |

పాతబస్తీలో మైనర్ బాలికలపై జరుగుతున్న డ్రగ్స్, లైంగిక దాడుల ఘటనలపై బాధితుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూ బాలికలు టార్గెట్.. పాతబస్తీలో డ్రగ్స్-లైంగిక దాడులు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాతబస్తీలో మైనర్ బాలికలపై జరుగుతున్న డ్రగ్స్, లైంగిక దాడుల ఘటనలపై బాధితుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెలను అదిల్ అలియాస్ అజీజ్ అనే వ్యక్తి నేతృత్వంలోని గ్యాంగ్ డ్రగ్స్‌కు అలవాటు చేశారని పలుమార్లు దాడి చేసిందని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi sanjay) సోమవారం ట్వీట్ చేస్తూ, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తీవ్రంగా ఖండించారు. తల్లిదండ్రుల వాంగ్మూలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దారుణ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సీసీటీవీ ఫుటేజీల్లోనూ నిందితులు బాధిత బాలికను మళ్లీ డ్రగ్స్ కోసం తీసుకు వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయని తెలిపారు.

తల్లిదండ్రులు బాలికను అస్వస్థత కారణంగా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా, గ్యాంగ్ నాయకుడు వారిని అడ్డగించి, బలవంతంగా ఆమెను స్కూటర్‌పై తీసుకెళ్లిపోయాడు.. కానీ తల్లిదండ్రులు అతన్ని పట్టుకోలేకపోయారని తెలిపారు. దీనిపై తల్లిదండ్రులు పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ, పోలీసు అధికారులు ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని ఆరోపించారు.

పోలీసులు డ్రగ్స్ వినియోగం, బాలికపై దాడి గురించి ఏ విధమైన విచారణ జరపలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ బాలిక భరోసా సెంటర్‌లో సహాయం పొందుతోంది.. కానీ బాలిక డ్రగ్ రాకెట్ పంజాలో ఇరుక్కుపోయి బాధపడుతోందని ఆవేదన చెందారు. ఓల్డ్ సిటీలోని ఒక పాఠశాలలో అధిక సంఖ్యలో హిందూ బాలికలు చదువుతున్న నేపథ్యంలో, ఆ స్కూల్‌ను లక్ష్యంగా చేసుకొని ఆ డ్రగ్స్ గ్యాంగ్ దారుణాలకు పాల్పడుతున్నా, ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్య తీసుకోలేదని బండిసంజయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..

Next Story