- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలిటీషియన్స్‌కు కూడా డ్రగ్స్ టెస్ట్ మస్ట్.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
సినీనటులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటనే వారి సినిమాలను రిలీజ్ చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన క్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. డ్రగ్స్ మూలాలు సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉన్నాయని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. కేవలం సినీ ఆర్టిస్టులే కాకుండా, ప్రజాప్రతినిధులు కూడా ప్రతి 90 రోజులకు ఒకసారి తప్పనిసరిగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు.
సినిమాల విడుదలకు బ్రేక్ వేయాలి..
సినీ నటీనటులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్న తర్వాతే వారి సినిమాలు విడుదల కావాలన్నారు. ఒకవేళ టెస్ట్‌లకు నిరాకరించిన పక్షంలో సినిమాల విడుదలను వెంటనే నిలిపివేయాలని కామెంట్ చేశారు. డ్రగ్స్ టెస్టుల విషయంలో రాజకీయ నాయకులు మినహాయింపు కోరకూడదని ఆయన అన్నారు. ఒకవేళ పొలిటీషియన్స్ టెస్ట్ చేయించుకోవడానికి నిరాకరిస్తే.. వారిపై పలు అనుమానాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోని ప్రజాప్రతినిధులను అసెంబ్లీలోకి కూడా అనుమతించకూడదని సంచలన ప్రతిపాదన చేశారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా తెలంగాణ తయారు కావాలంటే ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అనిరుధ్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
కాగా, శనివారం రాత్రి మొయినాబాద్ (Moinabad) పరిధిలోని ఆజీజ్‌నగర్ ప్రాంతంలోని బీఎమ్‌ఆర్ ఫామ్ హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లుగా ఈగల్ టీమ్‌కు సమాచారం వచ్చింది. ఈ మేరకు వారు ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులతో కలిసి ఫామ్‌హౌస్‌పై రెయిడ్ చేశారు. దీంతో ఫామ్‌హౌజ్‌లో ఉన్న ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా (Namid Mishra) కాల్పులు జరిపారు. తుపాకీ రితేష్ రెడ్డిది కాగా ఫైర్ చేసింది నమీద్ మిశ్రాగా గుర్తించారు. రాజకీయ, వ్యాపార, రియల్ ఎస్టేట్‌కు చెందిన మొత్తం 10 మంది ఈ పార్టీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy), ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, నమీద్ మిశ్రా, యం.రమేష్, శ్రవణ్‌కుమార్, విజయ్ కృష్ణ, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డి, ఓ మహిళ ఉన్నారు. డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్ష చేస్తే రోహిత్ రెడ్డి, నమీద్ మిశ్ర, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చింది.






