Drugs: హైదరాబాద్​లోని పబ్​లో డ్రగ్స్​ కలకలం.. 20 మందికి డ్రగ్స్ టెస్ట్‌లు!

by Ramesh Naini |

హైదరాబాద్‌లో మరోసారి మందు పార్టీ కలకలం సృష్టించింది. మాదాపూర్ పరిధిలోని ఓ పబ్‌‌లో డ్రగ్స్ వాడినట్లు దుమారం రేపుతోంది.

Drugs: హైదరాబాద్​లోని పబ్​లో డ్రగ్స్​ కలకలం.. 20 మందికి డ్రగ్స్ టెస్ట్‌లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ (Hyderabad)లో మరోసారి మందు పార్టీ కలకలం సృష్టిస్తోంది. మాదాపూర్ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఆలివ్ బిస్ట్రో పబ్‌‌లో (Drug party) డ్రగ్స్ వాడినట్లు దుమారం రేపుతోంది. పక్కా సమాచారం రావడంతో నిన్న రాత్రి పోలీసులు సోదాలు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆలివ్ బిస్ట్రో పబ్‌‌పై మాదాపూర్ పోలీసులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. తనిఖీల్లో భాగంగా 20 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సింది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి కృషి చేస్తోంది. డ్రగ్స్‌ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ పార్టీలు అక్కడక్కడ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్‌, అసాఘిక కార్యక్రమాలకు అడ్డగా రిసార్ట్స్, పబ్స్ మారాయని.. నిత్యం వాటిపై పోలీసుల నిఘా కొనసాగుతూనే ఉంది.

Next Story