డీజీపీ ఆఫీసులో నషా ముక్త్ భారత్ అభియన్

by Muthe.Rajitha |

నషా ముక్త్ భారత్ అభియన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ‌లోని డీజీపీ కార్యాలయంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఐజీపిఅండ్ఎల్ ఎం. రమేష్ ఆధ్వర్యంలో బుధవారం ప్రతిజ్ఞ చేయించారు.

డీజీపీ ఆఫీసులో నషా ముక్త్ భారత్ అభియన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నషా ముక్త్ భారత్ అభియన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ‌లోని డీజీపీ కార్యాలయంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఐజీపిఅండ్ఎల్ ఎం. రమేష్ ఆధ్వర్యంలో బుధవారం ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల హానికరమైన ప్రభావం నుండి సమాజాన్ని, ముఖ్యంగా యువతను రక్షించడానికి పోలీసు నిబద్ధతను పునరుద్ఘాటించడం కోసం ప్రతిజ్ఞ చేశారు . ఈ సందర్భంగా ఐజీ ఎం.రమేష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుర్వినియోగం చేయడం వల్ల ప్రజారోగ్యం, భద్రత , యువతరం భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుందని తెలిపారు.

అవగాహన ప్రచారాలను ముమ్మరం చేయాలని, అమలు చర్యలను బలోపేతం చేయాలని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా వినియోగాన్ని నిర్మూలించడానికి సమాజంతో కలిసి పనిచేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఏఐజీ ఎల్ అండ్ ఓ ఎం. రమణ కుమార్, డిఎస్‌పి ఉదయ్ భాస్కర్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story