రామ‌గుండంలో పోలీసుల‌కు చుక్క‌లు చూపించిన మందుబాబు

by velandi.Saikiran |

రామ‌గుండంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పుల్లను నోట్లో పెట్టుకొని, ఊదకుండా చుక్కలు చూపించాడు ఓ మందుబాబు.

రామ‌గుండంలో పోలీసుల‌కు చుక్క‌లు చూపించిన మందుబాబు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందు బాబులు హల్చల్ చేశారు. పీకలదాకా తాగి రోడ్లపై తిరిగారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, ఈ మందు బాబులు అస్సలు మాట వినడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అడుగడుగున నిర్వహిస్తున్నప్పటికీ, పీకలదాకా తాగి రోడ్లపై మందుబాబులు చిందులు వేశారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా నిన్న కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ముఖ్యంగా రామగుండంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించగా, పోలీసులకు ఊహించని పరిణామం ఎదురైంది.

ఓ మందుబాబును పట్టుకున్న పోలీసులు, టెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పుల్లను నోట్లో పెట్టుకొని, ఊదకుండా చుక్కలు చూపించాడు ఓ మందుబాబు. దాదాపు 30 నిమిషాల పాటు పోలీసులతో వాగ్వాదానికి కూడా పాల్పడ్డాడు. చివరికి గట్టిగా పోలీసులు బెదిరించడంతో, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కు సహకరించాడు. ఈ సందర్భంగా అతనికి 89 పాయింట్లు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైరల్ గా మారింది. అటు హనుమకొండలో బ్రీత్ అనలైజర్ తో తనిఖీ చేయగా ఓ వ్యక్తికి 432 పాయింట్లు వచ్చింది. 2025 లో ఇది హైయెస్ట్ అంటున్నారు. క్లిక్

Next Story