- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi : డ్రోన్లు యుద్ధరంగాన్ని విప్లవాత్మకంగా మార్చేశాయి : రాహుల్ గాంధీ
డ్రోన్లు(Drones) యుద్ధరంగాన్ని విప్లవాత్మకం(Revolutionised Warfare) గా మార్చేశాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)అభివర్ణించారు

దిశ, వెబ్ డెస్క్ : డ్రోన్లు(Drones) యుద్ధరంగాన్ని విప్లవాత్మకం(Revolutionised Warfare) గా మార్చేశాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)అభివర్ణించారు. డ్రోన్ల తయారీ, అనుబంధ రంగాల అభివృద్ధికి ఉన్న అవకాశాలు..ఉద్యోగాల కల్పన, ఆర్థికాభివృద్ధి అంశాలపై తన అభిప్రాయాలను వివరిస్తూ రాహుల్ గాంధీ ఓ వీడియో విడుదల చేశారు. బ్యాటరీలు, మోటార్లు, ఆప్టిక్స్ కలిపి డ్రోన్ లను అనూహ్యమైన రీతిలో కదిలించేందుకు, కమ్యూనికేట్ చేసేందుకు సహాయపడుతున్నాయన్నారు. కానీ డ్రోన్లు ఒకే ఒక్క టెక్నాలజీ కావని..ఇవి ఒక బలమైన పారిశ్రామిక వ్యవస్థ ద్వారా పుట్టుకొచ్చిన క్రియాశీల ఆవిష్కరణలన్నారు.
డ్రోన్ల ఉత్పత్తి ఓ నూతన పారిశ్రామిక విప్లవమని రాహుల్ వివరించారు. డ్రోన్ల తయారీతో ముడిపడిన ఇతర రంగాల అభివృద్ధికి చాల అవకాశాలున్నాయన్నారు. యుద్ధరంగంతో పాటు ఇతర సేవా రంగాల్లో , వ్యవసాయ రంగాల్లో డ్రోన్ల ప్రాధాన్యత పెరిగిపోతుందన్నారు. టెలిప్రమోటర్ పై ఏఐ (AI) గురించి ప్రసంగాలు చేయడం తప్ప.. దురదృష్టవశాత్తూ ప్రధాని మోడీ దీని ప్రాముఖ్యతను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. అసలైన టెక్నాలజీ అభివృద్ధిలో మన ప్రస్తుత పోటీదారులు ముందుకు సాగుతున్నారని.. మాటలు కాదు, దేశానికి బలమైన ఉత్పాదనా స్థావరం అవసరమని రాహుల్ అభిప్రాయపడ్డారు.
భారత్‌లో అపారమైన ప్రతిభ, విశాలమైన స్థాయి, అభివృద్ధి దిశలో ఉన్న ప్రేరణ ఉందన్నారు. మన యువతకు ఉద్యోగావకాశాలు అందించడానికి, దేశాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లడానికి మనం స్పష్టమైన దృక్పథంతో నిజమైన పారిశ్రామిక శక్తిని నిర్మించాలన్నారు. ఇందుకోసం డ్రోన్ల తయారీ రంగాలను ప్రోత్సహించాల్సిన అవసరముందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఓరకంగా చెప్పాలంటే డ్రోన్ల తయారీ ప్రక్రియ పారిశ్రామిక ప్రగతికి, ఉపాధి కల్పనకు, శాస్త్ర, సాంకేతి రంగాల అభివృద్ధికి గేమ్ ఛేంజర్..మైలురాయిగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు.






