Drone surveillance: జూబ్లీహిల్స్ పోలింగ్‌పై డ్రోన్ల నిఘా.. ఎన్నికల నిర్వహణలో తొలి సారి

by Ramesh Naini |

రేపు జరగబోయే (నవంబర్ 11) జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల పోలింగ్‌పై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Drone surveillance: జూబ్లీహిల్స్ పోలింగ్‌పై డ్రోన్ల నిఘా.. ఎన్నికల నిర్వహణలో తొలి సారి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేపు జరగబోయే (నవంబర్ 11) జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల పోలింగ్‌పై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎన్నికల నిర్వహణలో మొదటిసారిగా డ్రోన్ల(Drone surveillance)ను వినియోగిస్తూ పర్యవేక్షణ చేపట్టనున్నారు. మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. వీటిలో 68 క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్ల వద్ద కేంద్ర బలగాలైన CRPF సిబ్బందిని మోహరించినట్లు ఆయన తెలిపారు.

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ ప్రక్రియను నిఘాలో ఉంచుతామని, అదనంగా డ్రోన్ల సహాయంతో పర్యవేక్షణ జరపనున్నామని సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. డ్రోన్‌ పర్యవేక్షణకు ముందు DRC సెంటర్‌ వద్ద డ్రోన్‌ డెమో షోను ఇవాళ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌ స్వయంగా పర్యవేక్షించారు. మొత్తం 139 డ్రోన్లు పోలింగ్‌ ప్రాంతాలపై నిఘా కోసం సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

కాగా, పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయగా, ఓటర్లు 1950 నంబర్‌ ద్వారా ఫోన్‌లో ఫిర్యాదులు చేయవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు.

Next Story