- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో మొదటిసారి డ్రైవర్ లెస్ బస్సులు
మనిషి చేసే ఏ పనిని అయినా ఈజీగా చేయగలనని నిరూపిస్తోంది ఏఐ. టెక్నాలజీలో పరుగులు పెడుతున్న ఏఐ వల్ల ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు ఊడిపోయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మనిషి చేసే ఏ పనిని అయినా ఈజీగా చేయగలనని నిరూపిస్తోంది ఏఐ. టెక్నాలజీలో పరుగులు పెడుతున్న ఏఐ వల్ల ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు ఊడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రైవర్ ఉద్యోగాలకూ ఎసరు పెట్టే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. వేరే ఏదో కంట్రీలో కూడా కాదు. మన హైదరాబాద్ లోనే డ్రైవర్ లెస్ బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఇది సిటీ రోడ్లపై కాదు. ఒక కాలేజీ క్యాంపస్ లో ఈ బస్సులు రన్ అవుతున్నాయి.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ లో డ్రైవర్ లేకుండా బస్సులు రన్ అవుతున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఒక విద్యాసంస్థ ప్రాంగణంలో పూర్తిస్థాయిలో డ్రైవర్ లెస్ బస్సులు రన్ అవుతుండటం పలువురిని ఆశ్చర్య పరుస్తుంటే.. కొందరిలో మాత్రం ఆందోళన రేపుతోంది. టెక్నాలజీ డెవలప్ అవ్వడం మంచిదే కానీ.. అది మనిషుల జీవనశైలిని దెబ్బతీసేలా ఉంటే ప్రమాదమని అభిప్రాయపడుతున్నారు. ఈ డ్రైవర్ లెస్ బస్సుల్ని ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ఎటానమస్ నావిగేషన్ పరిశోధనా విభాగం డెవలప్ చేసింది. ప్రస్తుతం 6 సీట్లు, 14 సీట్ల సామర్థ్యంతో క్యాంపస్‌లో రెండు ఎలక్ట్రిక్ బస్సులు రన్ అవుతున్నాయి.
అయితే ఈ బస్సులపై నెటిజన్ల రియాక్షన్ భిన్నంగా ఉంది. ఇప్పటికే ఊడుతున్న ఉద్యోగాలు చాలవన్నట్లు డ్రైవర్ ఉద్యోగాలకు కూడా ఎసరు పెట్టారా అని ఆందోళన చెందుతున్నారు. కొందరైతే అలాంటి బస్సులు రోడ్లపైకి వస్తే.. యాక్సిడెంట్లు జరిగినపుడు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.






