- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Draupadi Murmu: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక..
by Kema Shiva Kumar |
ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రేపు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupati Murmu) రాష్ట్రానికి రానున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రేపు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupati Murmu) రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ (Begumpet Airport)కు ప్రెసిడెంట్ (President) చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్ (Raj Bhavan)కు వెళ్లి సాయంత్రం 6.20 గంటల నుంచి 7.10 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఎన్టీఆర్ స్టేడియం (NTR Stadium)లో కోటి దీపోత్సవం (Koti Deepotsavam) కార్యక్రమానికి హాజరు అవుతారు. రాత్రి రాజ్‌భవన్ (Raj Bhavan)లో బస చేసి శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport) నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.
Next Story






