- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిమ్స్ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ నియామకం.. అధికారిక ఉత్తర్వులు విడుదల
నిమ్స్ (NIMS) ఆసుపత్రి కొత్త డైరెక్టర్‌గా ప్రముఖ వైద్యులు డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ నియమితులయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ (Rahul Devraj) నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ నిమ్స్ ఆసుపత్రిలోనే యూరాలజీ విభాగానికి ప్రొఫెసర్‌గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (HoD)గా సేవలు అందిస్తున్నారు. ఆయన అర్హతలను, అనుభవాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. నిబంధనల ప్రకారం ఆయనను మూడేళ్ల పాటు ఆయ నిమ్స్ డైరెక్టర్‌గా కొనసాగుతారని తెలంగాణ గవర్నర్ పేరిట ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్.చోంగ్తు అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు. అయితే, నిమ్స్ కొత్త డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్న డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్‌కు పలువురు వైద్యులు, సహచరులు అభినందనలు తెలిపారు.






