- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నగర రమేష్
తెలంగాణ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ నగర రమేష్ ఎన్నికయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ నగర రమేష్ ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని పంజాగుట్టలో జరిగిన అసోసియేషన్ ప్రత్యేక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రంగు శివ, జనరల్ సెక్రటరీగా కొమ్ము శేఖర్‌తో పాటు మరో 66 మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
6,500 కుటుంబాలను ఆదుకోవాలి..
ఈ సమావేశంలో లైసెన్స్ సర్వేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,500 మంది లైసెన్స్ సర్వేయర్లను కేవలం వ్యక్తులుగా కాకుండా, 6,500 కుటుంబాలుగా పరిగణించి ప్రభుత్వం ఆదుకోవాలని సభ్యులు కోరారు. వారందరికీ తగిన పని కల్పించడంతో పాటు, గౌరవ వేతనం అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భూభారతి చట్టం కింద ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగా పనులు చేస్తూ, రైతుల భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి తోడ్పాటు అందిస్తామని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని వారు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రులకు విజ్ఞప్తి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకుని సర్వేయర్ల వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలని అసోసియేషన్ కోరింది. సర్వేయర్ల పట్ల ప్రభుత్వం దయార్థ హృదయంతో వ్యవహరించి తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. అనంతరం నూతన అధ్యక్షుడు డాక్టర్ నగర రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, అదే విధంగా ఏళ్లుగా సేవలు అందిస్తున్న లైసెన్స్ సర్వేయర్లను సైతం గుర్తించి తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.






