- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెయిన్‌బో హాస్పిటల్స్‌లో అరుదైన శస్త్రచికిత్స.. ల్యాప్రోస్కోపిపై డాక్టర్ మానస కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. 26 ఏళ్ల యువతి గర్భాశయం నుండి సుమారు 2.7 కిలోల బరువున్న 11 పెద్ద ఫైబ్రాయిడ్లను అత్యాధునిక లాప్రోస్కోపిక్ పద్ధతిలో విజయవంతంగా తొలగించారు. యువతి భవిష్యత్తులో తల్లి అయ్యే అవకాశాన్ని కాపాడుతూ, గర్భాశయానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ శస్త్రచికిత్స నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ మానస బడ్వెలి మాట్లాడుతూ "ఇది చాలా క్లిష్టమైన కేసు. యువతి వయస్సు దృష్ట్యా ఆమె గర్భాశయాన్ని కాపాడటం మాకు అత్యంత ప్రాధాన్యత. ల్యాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా తక్కువ రక్తస్రావం, తక్కువ నొప్పి, వేగంగా కోలుకునే అవకాశం కలుగుతుంది. శస్త్రచికిత్స అనంతరం సదరు యువతి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు" అని తెలిపారు.
లాప్రోస్కోపీ తో అద్భుతం:
బాధిత యువతి గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పి, అధిక రక్తస్రావంతో బాధపడుతోంది. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భాశయంలో భారీ కణితులు ఉన్నట్లు గుర్తించారు. వీటి కారణంగా ఆమె గర్భాశయం ఎనిమిది నెలల గర్భిణి పరిమాణానికి పెరిగింది. ఇందులో మూడు కణితులు కర్బూజ పండు అంత పెద్దవిగా ఉండగా, మిగిలినవి మోసంబి కాయ పరిమాణంలో ఉన్నాయి. సాధారణంగా ఇంత పెద్ద కణితులు ఉన్నప్పుడు ఇతర ఆసుపత్రులు ఓపెన్ సర్జరీ చేయాలని సూచిస్తాయి. అయితే, బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్స్‌లోని సీనియర్ గైనకాలజిస్ట్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ మానస బడ్వెలి నేతృత్వంలోని బృందం సవాలును స్వీకరించి, కేవలం చిన్న రంధ్రాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. హై-రిజల్యూషన్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కణితుల స్థానాన్ని కచ్చితంగా గుర్తించి, అత్యంత జాగ్రత్తగా వాటిని తొలగించారు.
లాప్రోస్కోపి ప్రయోజనాలు:
కోత చిన్నదిగా ఉండటం వల్ల శస్త్రచికిత్స తర్వాత నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. రోగులు చాలా త్వరగా తమ దైనందిన పనులకు తిరిగి వెళ్లవచ్చు. చర్మంపై పెద్ద గాయాలు ఉండవు, సౌందర్య పరంగా కూడా ఇది మేలైనది. రక్తస్రావం, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ. మహిళల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్ల పట్ల అవగాహన అవసరమని, సరైన సమయంలో గుర్తిస్తే అత్యాధునిక చికిత్సలతో గర్భాశయాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచించారు.






