ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు.. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం

by Javid Pasha |

డీఎమ్​హెచ్​వోల పోస్టులు ఏర్పాటు చేయడం హర్షనీయమని ప్రభుత్వ వైద్యుల సంఘం డీహెచ్ విభాగం అధ్యక్షుడు డాక్టర్​ లాలు ప్రసాద్​ రాథోడ్ పేర్కొన్నారు.

ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు.. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో ఏళ్ల నుంచి రీఆర్గనైజేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న సందర్భంగా కొత్త డీఎమ్​హెచ్​వోల పోస్టులు ఏర్పాటు చేయడం హర్షనీయమని ప్రభుత్వ వైద్యులసంఘం డీహెచ్ విభాగం అధ్యక్షులు డాక్టర్​ లాలు ప్రసాద్​ రాథోడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాదుకు నూతనంగా 6 డీఎమ్​హెచ్​వోల ఏర్పాటు , అర్బన్ పీహెచ్​సీ లలో రెగ్యులర్ వైద్యులను తీసుకోవడం వంటివి ఆరోగ్య రంగానికి విప్లవాత్మక మార్పులని కొనియాడారు.

గురువారం హైదరాబాద్​ లో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రజారోగ్య పథకాలు , మంచి కార్యక్రమాలు చేపట్టడం మంత్రి హరీష్​రావుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. దీంతో పాటు టైం బౌండ్ ప్రమోషన్ల విషయంలో కూడా నిర్ణయం తీసుకొని ప్రజారోగ్య విభాగంలోని వైద్యులకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బహుమానం అందించాలని కోరారు. సీఎం కేసీఆర్,మంత్రి హరీష్​ రావు, డీహెచ్​శ్రీనివాసరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు దీన్​దయాల్, రంజిత్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న, నవ్య, మౌనిక, తదితరులు ఉన్నారు.

Next Story