ఓటరు చీటీలు ఇంకా అందలేదా..? ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-11 03:19:39  IST  )

రాష్ట్రంలో తొలి విడత పంచాయితీ ఎన్నికలు మొదలయ్యాయి. దీంతో ఓటు వేసేందుకు ప్రజలు ఓటింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు.

ఓటరు చీటీలు ఇంకా అందలేదా..? ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో తొలి విడత పంచాయితీ ఎన్నికలు మొదలయ్యాయి. దీంతో ఓటు వేసేందుకు ప్రజలు ఓటింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అయితే ఓటు వేయాలంటే ఓటరు చీటీ అవసరం. గ్రామాల్లో ఇప్పటికే చాలా మందికి ఓటరు చీటీలు అందినా కొంతమందికి అనేక కారణాల వల్ల చీటీలు అందకపోవచ్చు. లేదా తీసుకున్న చీటీలు పోగొట్టుకోవచ్చు. అలాంటి వారు ఓటు వేసేందుకు ఆందోళన చెందుతుంటారు. కానీ అలాంటి టెన్షన్ అవసరం లేకుండా ఓటరు చీటీలను tepoll యాప్, https://tsec.gov.in/voterSlipRural.do వెబ్ పోర్టల్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఒకవేళ మీరు పోర్టల్ లో చీటీ డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకుంటే లింక్ ఓపెన్ చేసి జిల్లా, మండలం, గ్రామం, వార్డు, ఎపిక్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తరవాత సెర్చ్ ఫర్ ఓటర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అంతే మీ ఓటర్ చీటీ డౌన్ లోడ్ అవుతుంది. కాబట్టి ఓటర్ చీటీ అందని వారు చివరి క్షణంలో అయినా సరే ఇలా క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎవరైనా పెద్దవాళ్లు తమ చీటీని మర్చిపోయినా, లేదంటే పోగొట్టుకున్నా యువత వారికి ఫోన్ లో డౌన్ లోడ్ చేసి ఇవ్వడం ద్వారా ఓటు వినియోగించుకునేలా చేయవచ్చు.

Read More..

ఎక్లాస్‌ఖాన్‌పేట్‌లో పరిస్థితి ఉద్రిక్తం.. బాహాబాహీకి దిగిన MLA, MLC వర్గీయులు

Next Story