- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షల హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్
ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి పలు విభాగాల్లో డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టిక్కెట్లు నేటి నుంచి తెలంగాణ పబ్లిక్

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి పలు విభాగాల్లో డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టిక్కెట్లు నేటి నుంచి తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు జూన్ 10 నుండి 13 వరకు, జూన్ 20 నుండి 24 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలతో కూడిన హెచ్‌ఎండిఎ పరిధిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సర్వే అండ్ లాంగ్వేజ్ టెస్టులు (డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్) మినహా మిగిలిన అన్ని ఆబ్జెక్టివ్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో జరుగుతాయని పేర్కొన్నారు.
ఈ డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను నేటి నుండి కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. భవిష్యత్ అవసరాల కోసం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డూప్లికేట్ హాల్ టికెట్లు జారీ చేయబడవని కమిషన్ స్పష్టం చేసింది. హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే, అభ్యర్థులు హెల్ప్-డెస్క్ ల్యాండ్‌లైన్ నంబర్ 040-22445566 ద్వారా సంప్రదించవచ్చని సూచించింది.






