- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెవెన్యూ శాఖ పని తీరుపై అనుమానాలు.. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
తెలంగాణ రెవెన్యూ శాఖలో ఇటీవల చేపట్టిన పదోన్నతులు, పోస్టింగులు వివాదాస్పదంగా మారాయని, విజిలెన్స్, ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న తహసీల్దార్లకు సైతం నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించారంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ అభ్యంతరం వ్యక్తం చేసింది. ..

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రెవెన్యూ శాఖలో ఇటీవల చేపట్టిన పదోన్నతులు, పోస్టింగులు వివాదాస్పదంగా మారాయని, విజిలెన్స్, ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న తహసీల్దార్లకు సైతం నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించారంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ సంస్థ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ఆర్డీవో గ్రూప్-1 స్థాయి అధికారి అని, దీనిని ఐఏఎస్ ఆఫీసర్ ఫీడర్ కేడర్‌గా పరిగణిస్తారని, నియామకాల సమయంలో ఎంపిక కమిటీ ద్వారా సమగ్ర విచారణ జరగాలని పద్మనాభరెడ్డి గుర్తు చేశారు. ఇటీవల 12 మంది తహసీల్దార్లకు ఆర్డీవోలుగా తాత్కాలిక పదోన్నతులు ఇవ్వడంలో ఎటువంటి నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. కొందరు తహసీల్దార్లు కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పదోన్నతులు పొందారని, కోర్టు కేవలం "పదోన్నతి అంశాన్ని పరిశీలించాలని" మాత్రమే సూచించిందని, అది తప్పనిసరిగా పదోన్నతి ఇవ్వాలనే ఆదేశం కాదని లేఖలో స్పష్టం చేశారు.
కానీ అధికారులు దీనిని వక్రీకరించి పదోన్నతులు కల్పించారని లేఖలో పేర్కొన్నారు. పదోన్నతి పొందిన 12 మందిలో ఏడుగురికి నేరుగా ఆర్డీవో పోస్టింగులు ఇవ్వడంపై ఫోరం అనుమానాలు వ్యక్తం చేసింది. ఏసీబీకి పట్టుబడిన తహసీల్దార్‌కు సైతం కోర్టు ఉత్తర్వుల పేరుతో ఆర్డీవోగా పదోన్నతి కల్పించడం దారుణమని ఎం.పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా తహసీల్దార్లకు ఇచ్చిన అన్ని తాత్కాలిక పదోన్నతులు, పోస్టింగులపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు ఆ నియామకాలను నిలిపివేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.






