- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: మొయినాబాద్‌లో జంట హత్యల కలకలం.. నరరూప రాక్షసులై..!

దిశ, వెబ్‌డెస్క్ : మొయినాబాద్ ఫాంహౌస్ సమీపంలో జంటహత్యలు జరిగిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఓ ప్రభుత్వ స్థలంలో ఇద్దరు ముస్లిం మహిళలు దారుణంగా హత్యకు గురైన ఘటన శనివారం వెలుగుచూసింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ముస్లిం వర్గానికి చెందిన మహిళలుగా గుర్తించారు. ఆర్థిక లావాదేవీలు, వడ్డీ డబ్బుల గొడవలే ఈ ఘోరానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
పోలీసుల కథనం ప్రకారం.. తాండూరుకు చెందిన సదరు ఇద్దరు మహిళలు గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని వారి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, మొబైల్ సిగ్నల్స్ ట్రాక్ చేయగా.. వారు మొయినాబాద్ వైపు వచ్చినట్లు తేలింది. ఈ క్రమంలోనే మొయినాబాద్ ఫాంహౌస్ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఇద్దరు మహిళలు రక్తపు మడుగులో శవాలై కనిపించారు.
డబ్బులిస్తామని నమ్మబలికి.. స్కెచ్ వేసి హత్య!
మృతులిద్దరూ తాండూరు పరిసర ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు వీరి వద్ద పెద్ద మొత్తంలో అప్పుగా డబ్బులు తీసుకున్నారు. అయితే.. గడువు ముగిసినా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు సదరు వ్యక్తులను గట్టిగా నిలదీశారు. దీంతో ఎలాగైనా వీరి పీడ వదిలించుకోవాలని చూసిన అప్పు తీసుకున్న వ్యక్తులు ఒక పథకం ప్రకారం స్కెచ్ వేశారు. "మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాం.. ఇక్కడికి రండి" అంటూ నమ్మబలికి ఆ మహిళలను తాండూరు నుంచి వికారాబాద్ మీదుగా మొయినాబాద్‌కు రప్పించారు. జనసంచారం లేని ఫాంహౌస్ సమీపంలోని ప్రభుత్వ స్థలానికి తీసుకెళ్లి, డబ్బుల విషయంలో మళ్లీ గొడవ జరగడంతో నిందితులు ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసి పరారయ్యారు.
ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, ఉన్నతాధికారులు కీలక ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫైనాన్స్ వివాదంలోనే ఈ హత్యలు జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తాండూరు నుంచి మొయినాబాద్ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.






