- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు పొందేందుకు వీలుగా దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ఉన్నతాధికారులు విడుదల చేశారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు పొందేందుకు వీలుగా దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ఉన్నతాధికారులు విడుదల చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను, వారి విద్యావకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక విడతను ప్రకటిస్తున్నట్లు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీజీసీహెచ్ఈ) చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. జులై 20 నుండి 26 వరకు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజుతో విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే జులై 20 నుండి జూలై 27 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జులై 27 న యూనివర్శిటీ హెల్ప్ లైన్ సెంటర్లలో నిర్వహించనున్నారు. జులై 30 న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కు జులై 30 నుండి ఆగస్టు 1 వకు అవకాశం కల్పించారు. కాలేజీల్లో రిపోర్టింగ్ జులై 31 నుండి ఆగస్టు 1 వరకు అవకాశం కల్పించారు. ఇప్పటికే దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఏ విడతలోనూ సీటు పొందని విద్యార్థులు తమ పాత దోస్త్ ఐడీ, పిన్ నంబర్‌ను ఉపయోగించి నేరుగా ఈ స్పెషల్ ఫేజ్‌లో పాల్గొనవచ్చు. ఇంతవరకు దోస్త్ పోర్టల్‌లో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు కూడా రూ. 400 చెల్లించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటికే సిసిఒటిపి ద్వారా కాలేజీల్లో చేరి, తమ సీట్లను ఖరారు చేసుకున్న విద్యార్థులు ఈ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్‌కు అర్హులు కారని కన్వీనర్ పేర్కొన్నారు. డిగ్రీలో ఖచ్చితంగా సీటు పొందాలనుకునే విద్యార్థులు ఈ ప్రత్యేక విడతలో వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.






