దోస్త్ స్పెషల్ ఫేజ్, స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-24 16:50:33  IST  )

దోస్త్ స్పెషల్ ఫేజ్, స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఈ నెల 25 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ టీజీసీహెచ్ఈ చైర్మన్

దోస్త్ స్పెషల్ ఫేజ్, స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ స్పెషల్ ఫేజ్, స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఈ నెల 25 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొ. వి. బాలకిష్ట రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం దీనికి సంబందిన షెడ్యూల్ ను గురువారం ప్రకటించారు. అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలలో, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలలోని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఆగస్టు 11 నుండి 12 వరకు అవకాశం కల్పించారు.

స్పెషల్ ఫేజ్ షెడ్యూల్:

రిజిస్ట్రేషన్ (రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400): జూలై 25 నుండి 31 వరకు.

వెబ్ ఆప్షన్లు: జూలై 25 నుండి 31 వరకు.

సర్టిఫికేట్ల వెరిఫికేషన్: జూలై 31.

సీట్ల కేటాయింపులు ఆగస్టు 3.

ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: ఆగస్టు 3 నుండి 6 వరకు.

కాలేజీలలో రిపోర్టింగ్: ఆగస్టు 4 నుంచి 6 వరకు

స్పెషల్ ఫేజ్ విద్యార్థులకు సూచనలు:

దోస్త్‌లో రిజిస్టర్ చేసుకొని సీటు రాని విద్యార్థులు తమ గత దోస్త్ ఐడీ, పిన్ తో స్పెషల్ ఫేజ్‌కు అర్హులని తెలిపారు. ఇప్పటివరకు దోస్త్‌లో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు కూడా స్పెషల్ ఫేజ్‌కు అర్హులని, అలాంటి విద్యార్థులు రూ.400 తో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కాలేజీలలో సీసీఓటీపీ తో తమ సీటును ఖరారు చేసుకున్న విద్యార్థులు స్పెషల్ ఫేజ్‌కు అర్హులు కారని పేర్కొన్నారు. విద్యార్థులు సీటు పొందడానికి ఎక్కువ సంఖ్యలో వెబ్ఆప్షన్లను ఎంచుకోవాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి అన్ని లోకల్ నాన్ లోకల్ విద్యార్థులు అర్హులని తెలిపారు. స్పాట్ అడ్మిషన్ విద్యార్థులు స్కాలర్ షిప్ కు అర్హులు కారని పేర్కొన్నారు.

Next Story