- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు గుడ్ న్యూస్.. దోస్త్ గడువు పెంపు
డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2025-26 స్పెషల్ ఫేజ్ ధృవీకరణ గడువును పొడిగించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2025-26 స్పెషల్ ఫేజ్ ధృవీకరణ గడువును పొడిగించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తుల మేరకు, ఇటీవల కురిసిన వర్షాల వల్ల విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి, కళాశాల విద్య కమిషనర్ దేవసేన ప్రకటించారు. స్పెషల్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థుల ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును ఆగస్టు 6 నుండి ఆగస్టు 12 వరకు పొడిగించారు.
స్పెషల్ ఫేజ్‌లో ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 6 నుంచి 12 అవకాశం కల్పించారు. అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీల్లోని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో స్పాట్ అడ్మిషన్లకు ఆగస్టు 13 నుంచి 14 వరకు అవకాశం కల్పించారు.






