సూపర్ స్టార్ కృష్ణ సాంగ్కు సీఐ సూపర్ డ్యాన్స్.. ఫ్యాన్స్ ఫిదా ( వీడియో)

by Dishafeatures2 |
సూపర్ స్టార్ కృష్ణ సాంగ్కు సీఐ సూపర్ డ్యాన్స్.. ఫ్యాన్స్ ఫిదా ( వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ పాటకు ఓ సీఐ అదరగొట్టే స్టెప్పులు వేశారు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆ సీఐపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆదివారం పోలీసుల సేవలను గుర్తు చేస్తూ సురక్షా ఉత్సవాలను నిర్వహించారు. అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో డోర్నకల్ సీఐ వెంకటరత్నం సూపర్ స్టార్ కృష్ణ ‘జుంబారే.. జుంజుంబారే’’ అనే సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. అచ్ఛం కృష్ణ లాగే డ్యాన్స్ వేసి ఆడియెన్స్ ను అలరించారు. కాగా సీఐ డ్యాన్స్ వేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story

Most Viewed