Agriculture University: ప్రైవేట్ సంస్థలతో అగ్రికల్చర్ వర్సిటీ ఒప్పందాలు రద్దు: వీసీ జానయ్య

by Prasad Jukanti |   (  Updated:2024-11-04 12:29:03  IST  )

ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు రద్దు చేసుకున్నట్లు అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య వెల్లడించారు.

Agriculture University: ప్రైవేట్ సంస్థలతో అగ్రికల్చర్ వర్సిటీ ఒప్పందాలు రద్దు: వీసీ జానయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీతో (Prof. Jayashankar Agriculture University) ఏ ప్రైవేట్ సంస్థతో అనుబంధం లేదని యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ డా.అల్దాస్ జానయ్య ((Dr. Aldas Janaiah)) స్పష్టం చేశారు. కోర్సుల నిర్వహణలో ఏ ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం లేదని తెలిపారు. ప్రైవేట్ సంస్థలతో యూనివర్సిటీ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేశామని తెలిపారు. వ్యవసాయ కోర్సుల్లో సీట్లు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు మోసం చేస్తున్నారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీట్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్న దళారులను నమ్మొద్దన్నారు.

Next Story