- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వంలో ఉండి ఇలాంటి విషయాలు చెప్పొద్దు.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు
దేశంలో ఉచిత పథకాలపై చర్చ కొనసాగుతోన్న వేళ రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఉచిత పథకాలపై చర్చ కొనసాగుతోన్న వేళ రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉచిత పథకాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పకడ్బందీగా అర్హులను గుర్తించి వారికి మాత్రమే ఉచిత పథకాలను వర్తింపజేసేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. నిజమైన నిరుపేదలకే బియ్యం ఇవ్వాలని.. అమ్ముకునే వారికి కాదని కామెంట్ చేశారు.
ఆనాడు ఎన్టీఆర్ (NTR)రూ.2కే కిలో బియ్యం ఇస్తే.. దేవుడని అన్నారని.. తాము కిలో రూ.60 ఉన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా కోటి 10 లక్షల కుటుంబాలు ఉంటే.. రేషన్ కార్డులు కోటి 25 లక్షలు ఉండటం గమనార్హమని అన్నారు. పక్క రాష్ట్రం వారికి ఇక్కడ కూడా రేషన్ కార్డులు (Ration Cards) ఉన్నాయని ప్రభుత్వంలో ఉండి ఇలాంటి విషయాలు చెప్పకూడదని.. తప్పక చెప్పాల్సి వస్తుందని తెలిపారు. అందరి దగ్గర తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి.. రాష్ట్రంలో అంతా పేదోళ్లే ఉన్నారా అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు.






