- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను రెచ్చగొట్టొద్దు.. చావుకు భయపడను: కొండా మురళి సెన్సేషనల్ కామెంట్
ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ (Congress)లో నేత మధ్య వర్గ విబేధాలు తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ (Congress)లో నేత మధ్య వర్గ విబేధాలు తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి (Konda Murali) గాంధీ భవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవిని కలిశారు. ఈ మేరకు ఆయన ఉమ్మడి జిల్లా పార్టీలోని విబేధాలు, జరుగుతోన్న తాజా పరిణామాలపై క్రమశిక్షణ కమిటీకి మొత్తం ఆరు పేజీలతో కూడిన లేఖను అందజేశారు. అనంతరం గాంధీభవన్ నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తిని తానేనని అన్నారు.
బీసీలకు న్యాయం చేసే పనిలో తాను నిత్యం బిజీగా ఉంటానని తెలిపారు. రేవంత్ రెడ్డి కలకాలం సీఎంగా ఉండాలని కోరుకునే వ్యక్తినని పేర్కొన్నారు. కాంగ్రెస్ పెద్దలంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. తనను ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగలేదని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన ముందు ఉన్న లక్ష్యమని స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో జరుగుతోన్న పరిణామాలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి అన్ని విషయాలు వివరించానని అన్నారు. తనను రెచ్చగొట్టొద్దని, చావుకు కూడా భయపడే వ్యక్తి కాదని కొండ మురళి పరోక్షంగా సొంత పార్టీలోని ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు సవాల్ విసిరారు.






