ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు.. గ్రేటర్ విలీనంపై మల్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-02 09:05:59  IST  )

జీహెచ్‌ఎంసీ (GHMC)లో శివారు పరిధిలోని 30 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల విలీన ప్రక్రియ ఇప్పటికే అధికారికంగా పూర్తి అయింది.

ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు.. గ్రేటర్ విలీనంపై మల్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ (GHMC)లో శివారు పరిధిలోని 30 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల విలీన ప్రక్రియ ఇప్పటికే అధికారికంగా పూర్తి అయింది. ఈ మేరకు పురపాలక శాఖ జీవో నెంబర్ 264 కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో గ్రేటర్ విలీనంపై ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ విలీనం పేరుతో రంగారెడ్డి జిల్లాను విడదీయొద్దని అన్నారు. జిల్లాకు రంగారెడ్డి పాత పేరునే కొనసాగించాలని తెలిపారు. అలా కాకుండా జిల్లా ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని సభలో ప్రస్తావించారు. విలీనం విషయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Next Story