- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంటలు ఎండిపోవద్దు : సీఎస్ శాంతికుమారి
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా పంటలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా పంటలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. నీటి పారుదల శాఖ అధికారులు, కలెక్టర్లతో మంగళవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వేసవి కాలం ప్రారంభమైందని.. ఈ మూడు నెలలు పంటలకు చాలా కీలకం అని చెప్పారు. పంటలు ఎండిపోకుండా ప్రాజెక్టుల ద్వారా నీరు అందించాలని సూచించారు. సీఎం ఇటీవల చెప్పిన విధంగా కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు.
టెయిల్ టు హెడ్ విధానం..
నీటి నియంత్రణ కోసం టెయిల్ టు హెడ్ విధానాన్ని అమలు చేయాలని సీఎస్ సూచించారు. నీటి సక్రమ వినియోగం కోసం అన్ని ప్రాజెక్టులలో ఆన్/ఆఫ్ విధానాన్ని అనుసరించాలని.. మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు, తనిఖీల కోసం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని అన్నారు. నీటి విడుదలలో ఇబ్బందులు వచ్చిన చోట మరమ్మతు పనులకు ఓ అండ్ ఎం టీమ్ తప్పకుండా హాజరుకావాలన్నారు. ఈఎన్సీలు, సీఈలు టెయిల్ ఎండ్ సమస్యలను నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. తద్వారా నీరు చివరి ఆయకట్టు వరకు చేరే వీలుంటుందని సీఎస్ సూచించారు. ఈఈలు కూడా కాలువలపై నైట్ పెట్రోలింగ్ చేయాలని ఆదేశించారు. నీటి చౌర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పోలీస్ ప్రొటెక్షన్ కోసం రిక్వెస్ట్
పంటలు ఎండిపోకుండా వచ్చే మూడు నెలలు కీలకంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంలో నీటి పారుదల శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఈఎన్సీ అనిల్ కుమార్ సీఎస్ వద్ద ఓ రిక్వెస్ట్ పెట్టారు. అన్ ఆథారైజ్డ్ నీరు డ్రా చేయకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరారు. ఏటా కొన్ని చోట్ల రాష్ట్రవ్యాప్తంగా కూడా రైతులు నీటి చౌర్యానికి పాల్పడుతున్న విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. యూటీలు పగల కొట్టడం.. కాలువలకు గండి పెట్టడం వల్ల నీరు ఆయకట్టు చివరి వరకు చేరకుండా నష్టం జరుగుతున్నట్లు వివరించారు. ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో నీళ్లు అంతటికి అందుతాయని.. కానీ మధ్యమధ్యలో నీటి చౌర్యం వల్ల చివరి ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని చెప్పారు. దాంతో సీఎస్ కూడా పోలీస్ ప్రొటెక్షన్‌కు అంగీకరించినట్లు ఈఎన్సీ అనిల్ కుమార్ తెలిపారు.






