- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Revanth Reddy: బీఆర్ఎస్ అనే మొక్క మళ్లీ మొలవొద్దు: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని సకల దరిద్రాలకు బీఆర్ఎస్ పార్టీనే కారణం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ మొక్క మళ్లీ మొలవొద్దు: తెలంగాణలో పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్నింటిలోపదేళ్ల పాటు బీఆర్ఎస్ వాళ్లే ఏకఛత్రాధిపత్యం చెలాయించారని అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమకు ఓట్లు వేస్తే మున్సిపాలిటీల్లో సమస్యలు పరిష్కరిస్తామనని చెప్పడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫైర్ అయ్యారు. ఇన్నేళ్లు మున్సిపాలిటీల్లో మేం ఎక్కడైనా అధికారంలో ఉన్నామా? మున్సిపాలిటీల్లో సమస్యలకు బీఆర్ఎస్ (BRS Party) వాళ్లు కారణం కాదా? అని నిలదీశారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇన్నాళ్లు కీలక పదవులన్నీ కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉన్నాయని తెలంగాణలోని సకల దరిద్రాలకు బీఆర్ఎస్ పార్టీనే కారణం అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ ఈ రాష్ట్రంలో మొలకెత్తకుండా యాసిడ్ పోసి కడిగేయాలన్నారు.
ఫోన్ ట్యాపింగ్ విచారణలో విస్తుపోయే విషయాలు:
పదేళ్లు ప్రజా సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సంగతి పక్కన పెడితే కనీసం కేసీఆర్ రేషన్ కార్డులైనా ఇచ్చారా? అని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ గెలిచి అసెంబ్లీకి వస్తున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు గెలిస్తే వారు పని చేస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ఓటు అడిగే అర్హతైనా ఉందా అన్నారు. బీఆర్ఎస్ నేతలది అహంకారం, విషయం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని వీరి మాటలు వింటుంటే గంజాయి కొట్టి మాట్లాడుతున్నారా? అసలు హోష్ లో లేనట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. వీరి గురించి ఈగల్ టీమ్ కు సమచారాం ఇవ్వాలా అనే అనుమానం కలుగుతోందన్నారు. పదేళ్లు ఎవ్వరిని వదలకుండా పోన్ ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పైశాచిక ఆనందం పొందారు. భార్యభర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా విన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి రూ. వందల కోట్ల ఎలక్టోరల్ బాండ్లు తీసుకున్నారని విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ నేతలు విచారణకు వెళ్లేటప్పుడు సిగ్గుపడాల్సింది పోయి ఏదో యుద్ధానికి వెళ్తున్నట్లు వచ్చారని విమర్శించారు.
ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక ప్రణాళిక:
బీజేపీ, బీఆర్ఎస్ రెండూఒక్కటేనని ప్రజలకు వ్యతిరేకంగా ఏ చట్టం తీసుకువచ్చినా బీఆర్ఎస్ బీజేపీకి మద్ధతు ఇచ్చిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, నోట్ల రద్దును అసెంబ్లీ ఏర్పాటు చేసి మరీ అభినందించారన్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి, ఫార్ములా ఈ రేస్ కేను ఈడీలో ఎందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును విచారణకైనా పిలవడం లేదని ప్రశ్నించారు. పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగిన చందంగా బీఆర్ఎస్, బీజేపీ సంబంధం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిందని మేము వచ్చిన మొదటి రోజు నుంచే ప్రతినెల ఒకటో తేదీననే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ వైద్యం ఖర్చులు రూ. 10 లక్షలకు పెంచామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అందిస్తున్నామన్నారు. మేము వచ్చాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి వారికి సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. మేము వచ్చాక 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నామన్నారు.
గతంలో జీరాక్స్ సెంటర్లలో పరీక్ష పత్రాలు దొరికాయని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణతో శాశ్వత పరిష్కారం చూపామన్నారు. మున్సిపాలిటీల్లో 61 శాతం బీసీలకు టికెట్లు ఇచ్చామన్నారు. బీసీ వర్గీకరణకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తికే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందన్నారు. ఈ రాష్ట్రంలో మరో ఎనిమిదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండబోతోందని ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యంత్రిగా, మున్సిపల్ మంత్రిగా నేను తీసుకుంటానన్నారు.






